రామ్ చరణ్ పై తీవ్ర విమర్శలు.. అండగా నిలిచిన గురూజీ రాధా మనోహర్ దాస్

  • అయ్యప్ప మాలతో కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్
  • చరణ్ పై సోషల్ మీడియాలో విమర్శలు
  • రామ్ చరణ్ నిజమైన భక్తుడన్న రాధా మనోహర్ దాస్
అయ్యప్ప మాలలో ఉన్న హీరో రామ్ చరణ్ కడప దర్గాకి వెళ్లడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ అండగా నిలిచారు. 

రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ... రామ్ చరణ్ నిజమైన భక్తుడని అన్నారు. శివాలయాన్ని చరణ్ శుభ్రం చేస్తాడని... వారి పాపకు క్లీంకార అనే పేరు పెట్టాడని తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ సమయంలో విదేశాలకు వెళ్లినప్పుడు కూడా రాముల వారిని వెంట తీసుకెళ్లారని చెప్పారు. చరణ్ తప్పు చేసినట్టు ఎవరికైనా అనిపిస్తే తన వద్దకు రావాలని... కూర్చొని మాట్లాడుకుందామని అన్నారు. చరణ్ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని చెప్పారు. 

మరోవైపు ఇదే అంశంపై చరణ్ భార్య ఉపాసన స్పందిస్తూ... తాము భారతీయులుగా అన్ని ధర్మాలను గౌరవిస్తామని చెప్పారు. ధర్మం అనేది అందరినీ ఒకటి చేస్తుందే తప్ప ఎవరినీ విడగొట్టదని అన్నారు. భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని... చరణ్ దానినే అనుసరించాడని చెప్పారు.

Ramcharan
Tollywood

More Telugu News